మెగాస్టార్ చిరంజీవికి కోర్టు నోటీసులు.. ఏమైందంటే..?

-

మెగాస్టార్ చిరంజీవికి తాజాగా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.. ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆయన విక్రయించారన్న పిటిషన్ పై నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దు అంటూ చిరంజీవిని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. నిర్మాణం పై స్టే కొనసాగించాలని.. చిరంజీవికి అటు సొసైటీకి కోర్టు సూచించింది. ఈ పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలి అని చిరంజీవిని అలాగే సొసైటీని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. ఇక ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 25వ తేదీకి తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే… ఎప్పుడూ కూడా ప్రజల క్షేమం కోసం ఆలోచించే ఈయన ఇప్పుడు ఇలా ఎలా కొనుగోలు చేశారు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్వరలోనే తనపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలి అని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయంతో తన ఖాతా ఓపెన్ చేసిన చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గర కాబోతున్నారు.

త్వరలోనే ఈ సినిమా కూడా విడుదల కాబోతోంది మరొకవైపు మరో రెండు ప్రాజెక్టులను ఆయన తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరొకవైపు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో కొడుకు విజయాన్ని చూసి ఉప్పొంగిపోతున్నారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news