గాజా ప్రజలకు ‘ఆహార’ కష్టాలు.. ఉరి కంటే ఇది దారుణమైన శిక్షంటూ కన్నీరుమున్నీరు

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య పోరు సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చి పెట్టింది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఇటు ఇజ్రాయెల్ పౌరులు.. అటు పాలస్తీనా పౌరులు వేల సంఖ్యలో మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇజ్రాయెల్ హమాస్​ను అంతం చేయాలన్న పట్టుపదలతో ఉంది. ఈ క్రమంలోనే గాజాను అష్టదిగ్బంధనం చేసి హమాస్​పై దాడులకు తెగబడాలని నిర్ణయించింది. అంతకుముందు ఉత్తర గాజాను ఖాళీ చేయాలని పౌరులకు హెచ్చరించింది.

అయితే ఈ హెచ్చరికలతో గాజా పౌరులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, తాగునీరు లేక అలమటిస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఉత్తర గాజా నుంచి వెళ్లిపోగా.. మిగిలిన వారు తరలి వెళ్లేందుకు ఇచ్చిన గడువును మరో 3 గంటలు పెంచింది. తాము నిర్దేశించిన సేఫ్టీ కారిడార్‌లో తరలి వెళ్లాలని .. ఆ మార్గంలో వెళ్తే ఎటువంటి దాడులు చేయమని స్పష్టం చేసింది.

గాజాలో ఇప్పటికే సంక్షోభం తలెత్తింది. ఇంధన సరఫరాను ఇజ్రాయెల్​ నిలిపివేయడం వల్ల గాజాలోని ఏకైక విద్యుత్​ ప్లాంట్​ మూతపడి ఆ ప్రాంతమంతా అంధకారంలోనే ఉంది. ప్రాణ భయంతో వ్యాపారులు బేకరీలను మూసివేయడం వల్ల కనీసం రొట్టెలు కూడా కొనలేక పౌరులు ఆకలితో అలమటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news