క్రిస్మస్ పార్టీలో తుపాకీ మోత.. 16 మంది దుర్మరణం

-

మెక్సికోలో మరోసారి తుపాకీ మోత మోగింది. ఈసారి క్రిస్మస్ సంబురాల్లో కాల్పులు కలకలం సృష్టించాయి. గ్వానాజువాటో రాష్ట్రంలోని సాల్వాటియెర్రా పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ జరిగిన పార్టీలో ఓ సాయుధుడు తుపాకీతో బీభత్సం సృష్టించాడు. పార్టీల్లో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు దుర్మరణం చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనలో 12 మంది చనిపోయినట్లు చెప్పారు. ‘పొసాడా’ అనే పార్టీ అనంతరం హాల్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నట్లు వివరించారు. అయితే కాల్పులు ఎందుకు చేశాడన్న విషయంపై ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు అదే రాష్ట్రంలోని సలామాంకా నగరంలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మరణించారని పోలీసులు తెలిపారు. గ్వానాజువాటోలో జాలిస్కో ముఠా, సినాలోవా ముఠా మద్దతు ఉన్న స్థానిక గ్యాంగ్ల మధ్య వైరం ఉండటం వల్ల తరచూ ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ దేశంలో అత్యదిక హత్యలు జరిగిన రాష్ట్రం ఇదేనని నేర గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news