ఇజ్రాయిల్ పై హమాస్ యుద్ధం.. సామాన్య పౌరులపైకి మిలిటెంట్ల కాల్పులు..!

-

ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్ల దాడులు కొనసాగుతున్నాయి. దేశంలోకి చొరబడిన పాలస్తీనా తీవ్రవాదులు వీధుల్లో వీరంగం సృష్టిస్తున్నారు. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ గ్రూప్ మెరుపు దాడితో ఇజ్రాయెల్ లో యుద్ద పరిస్థితిలు కొనసాగుతున్నాయి ఇజ్రాయెల్ పై మెరుపు దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు సరిహద్దును దాటి దేశంలోకి చొరబడ్డారు వీరు ఇజ్రాయెల్ వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరుపుతున్నారు.


దక్షిణ ఇజ్రాయెల్ లోని సెరాట్ ప్రాంతంలో కొందరు హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఓ స్థానికుడు తన టెర్రస్ పై నిల్చోని ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది మిలిటెంట్లు అతనిని గమనించి కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా అతడు కిందికి వంగి గోడ వెనక తలదాచుకున్నట్లుగా వీడియోలో ఉంది. అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయవాది ఆర్సెన్ ఓస్ట్రోవ్ స్కీ ఈ వీడియోను షేర్ చేశారు ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనికులను మిలిటెంట్లు బందీగా చేసుకుని వారిని నేలపై లాక్కుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి హసన్ మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో షార్ హనెగెవ్ రీజినల్ కౌన్సిల్ మేయర్ ఓఫీర్ లిబెస్రటీన్ మణించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version