అమెరికాలో పెరిగిన వివక్షాపూరిత నేరాలు.. పదేళ్లలో అత్యధికం..

అగ్రరాజ్యంగా వెలుగొందుతున్న అమెరికాలో విద్వేషపూరిత నేరాలు ఎక్కువవుతున్నాయి. వివక్ష కారణంగా జరుగుతున్న నేరాల సంఖ్య బాగా పెరిగింది. గత ఏడాది 2019లో వివక్షపూరిత నేరాల సంఖ్య 7314గా ఉంది. గడిచిన పదేళ్లలో ఇదే అత్యధికం. రంగు, జాతి, మతం, పేరిట ఏదో ఒక రూపంలో నేరాలు జరుగుతూనే ఉన్నాయి. 2008లో 7783నేరాలు జరగ్గా, ఆ తర్వాత అత్యధికంగా 2019లోనే జరిగాయి. గడిచిన మూడు సంవత్సరాలుగా చూసుకుంటే, 7175, 2018లో 7120, 2019లో 7314గా ఉంది.

ఈ ఏడాది జరిగిన మొత్తం నేరాల్లో 5512 నేరాలు వ్యక్తుల మీద జరగగా, 2811నేరాలు ఆస్తుల మీదా, 236నేరాలు సమాజం మీద జరిగాయి. ఈ నేరాలు చేసిన వాళ్లలో 52.5శాతం అమెరికా తెల్ల జనాలు ఉండగా, 23.9శాతం ఆఫ్రికన్ అమెరికన్లు ఉన్నారు. వీటిలో 4.4శాతం చర్చిల్లో, మసీదుల్లో, మిగతా ప్రార్థనా స్థలాల్లోనే జరిగాయని ఎఫ్ బీ ఐ ప్రకటించింది.