విస్తరణ వాదంతో రగులుతున్న జిత్తులమారి చైనా సరిహద్దుల్లో అలజడి రేపుతోంది. గల్వాన్ ఘటన తర్వాత నుంచి ఇండియా , చైనా రెండు దేశాలు సరిహద్దుల్లో తమ బలగాలను మోహరించాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. లడఖ్ ప్రాంతంలో చైనా తన సైన్యాన్ని మోహరిస్తోంది. దీనికి అనుగుణంగానే భారత్ కూడా k9 వజ్ర హోవిట్జర్ ట్యాంకులను చైనా వైపు ఎక్కుపెట్టి ఉంచింది. ఈ తుపాకులు దాదాపు 50 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదని, ఎతైన ప్రాంతాల్లో ఇవి సమర్థవంతంగా పనిచేయగలవని ఎంఎం నరవణే తెలిపారు.
సరిహద్దుల్లో తొలగని ఉద్రిక్తత.. చైనాకు ధీటుగా బలగాల మోహరింపు
-