ఇండియా Vs చైనా సైన్యం ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’.. విజయం మనదే

-

భారత సైన్యం చైనాపై తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలమని ప్రూవ్ చేసింది. టీమ్ స్పిరిట్ను చాటి చెప్పింది. సూడాన్‌లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’లో భారత జవాన్లు విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు ధ్రువీకరించాయి.

‘ఐక్యరాజ్య సమితి పీస్‌కీపింగ్‌ మిషన్‌’లో భాగంగా భారత్‌కు చెందిన కొంత మంది సైనికులు సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తుండగా అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా ‘టగ్‌ ఆఫ్‌ వార్‌’ ఆటను నిర్వహించారు. ఈ గేమ్లో మనవాళ్లు విజయం సాధించి తమ పోరాట పటిమను చాటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్, జైహింద్, భారత్ మాతా కీ జై అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news