స్విస్‌ బ్యాంకుల్లో తగ్గుతున్న భారతీయుల డబ్బులు.. ప్రస్తుతం ఎంత ఉందంటే?

-

 స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు తగ్గిపోతోంది. ఈ విషయాన్ని స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటా వెల్లడించింది. గతేడాది 2023లో ఈ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 70 శాతం క్షీణించి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరినట్లు ఈ డేటా తెలిపింది.  2023లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిధులు 1.04 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లకు అంటే, భారత కరెన్సీలో రూ.9,771 కోట్లకు పడిపోయాయని పేర్కొంది.

2021లో స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిల్వలు 14 ఏళ్ల గరిష్ఠానికి 3.83 బిలియన్లకు చేరగా.. ఆ తర్వాత స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల నిల్వల క్షీణత మొదలైనట్లు స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక డేటా పేర్కొంది. బాండ్లు, సెక్యూరిటీలు ఇలా భారతీయుల నిల్వలు భారీగా పడిపోయాయని .. కస్టమర్ డిపాజిట్ ఖాతాల్లోని మొత్తం నిధులు కూడా గణనీయంగా తగ్గాయని ఈ గణాంకాలు వెల్లడించాయి. 2023 చివరినాటికి స్విట్జర్లాండ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ పరిధిలోని బ్యాంకుల్లో భారతీయుల ఖాతాదారులకు చెల్లించాల్సిన మొత్తాలు 1,039.8 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్‌లుగా ఉన్నాయని తెలిపాయి. ఇందులో కస్టమర్ల డిపాజిట్లలో 310 మిలియన్ల స్విస్‌ ఫ్రాంక్​లు అని వార్షిక డేటా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news