పైరేట్స్ కు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ కమాండోలు.. వీడియో వైరల్

-

పశ్చిమ హిందూ మహాసముద్రంలో గత కొన్ని వారాలుగా పలు వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారత నౌకాదళం విజయవంతంగా అడ్డుకుంటోంది. తాజాగా సముద్ర దొంగలు హైజాక్‌ చేసిన ఎంవీ రుయెన్‌ వాణిజ్య నౌకను పైరేట్ చెర నుంచి విడిపించింది. ఈ దృశ్యాలను భారత నౌకాదళం సోషల్ మీడియాలో షేర్ చేసింది. నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను భారత నేవీ ఆధీనంలోకి తీసుకుంది. 17 మంది సిబ్బందిని కాపాడింది.

ఇండియన్‌ నేవీ అధికారులు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతాలో వెళ్లి ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఇందులో భాగంగా రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ నుంచి ధైర్యంగా పారాచూట్‌ల సాయంతో సముద్ర ఉపరితలంపైకి నేవీ కమాండోలు దూకి ప్రత్యేకమైన బోట్లలో హైజాక్‌ అయిన నౌక వద్దకు చేరుకున్నారు.

ఆ నౌకను దొంగల చెర నుంచి విడిపించింది. రూ.8 కోట్లకుపైగా విలువైన 37,800 టన్నుల సామగ్రితో కూడిన ఆ నౌకను బందీలు, సిబ్బందితో సహా నౌకను ఇండియన్‌ వెస్ట్‌కోస్ట్‌ వైపునకు తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news