ప్రపంచవ్యాప్తంగా భారత దేశానికి విభిన్న సంస్కృతులతో పాటు, వంటకాలకు ఎంతో పేరు ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే ప్రత్యేకమైన స్వీట్లకు కొదవే ఉండదు. ఏ పండుగ వచ్చిన స్వీట్లు లేకుండా పండగ జరగనే జరగదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే అనుభవపూర్వక ఆహార మార్గదర్శి – టేస్ట్ అట్లాస్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా టాప్ 10 ఉత్తమ చీజ్ డెజర్ట్ల జాబితాను విడుదల చేసింది.
ఇందులో భారత్ కు చెందిన రసమలై వ స్థానంలో నిలిచింది. పోలాండ్కు చెందిన సెర్నిక్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది, ఇది ప్రత్యేక రకం పెరుగు చీజ్ (ట్వరోగ్), గుడ్లు, చక్కెరతో తయారు చేయబడింది. కాగా భారత్ కు చెందిన రసమలై బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తారు. దీనికి భారత వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దీని తయారి పైనే ఆధారపడి బ్రతికే వారు కూడా ఉంటారు.