210 కిలోల బరువెత్తాలని ట్రై చేసి.. అంతలోనే మెడ విరిగి!

-

కొన్నిసార్లు వ్యాయామం కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. మరికొన్ని సార్లు వ్యాయామం చేసేటప్పుడు జరిగే కొన్ని ప్రమాదాలు ప్రాణాలకే ముప్పు తెస్తుంది. తాజాగా ఇండోనేసియాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అక్కడి ఓ జిమ్‌లో బార్‌బెల్‌తో కసరత్తు చేస్తున్న సమయంలో అదికాస్త మెడపై పడి ఓ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ మృతి చెందాడు. ఆ బార్‌బెల్‌ బరువు 210 కిలోలు కావడం గమనార్హం.

స్థానిక వార్తాసంస్థ కథనం ప్రకారం.. స్థానికంగా ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరున్న జస్టిన్‌ విక్కీ(33) ఎప్పటిలాగే బాలిలోని ఓ జిమ్‌లో వ్యాయామానికి వెళ్లాడు.  210 కిలోల బరువైన బార్‌బెల్‌ను భుజాలపై పెట్టుకుని వ్యాయామం చేయడం షురూ చేశాడు. బార్‌బెల్‌ను ఎత్తి, స్క్వాట్ పూర్తి చేసి.. తిరిగి పైకి లేచే సమయంలో బరువు ధాటికి బ్యాలెన్స్‌ కోల్పోవడంతో.. అది కాస్త మెడపై పడిపోయింది. దీంతో అతడి మెడ విరిగిపోయి.. అక్కడే కూలిపోయాడు. అక్కడున్నవారు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అత్యవసర శస్త్రచికిత్స చేసిన కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news