చైనా ఆర్మీ సరికొత్త ఎత్తులు…!

ఒకపక్క భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో చైనా ఆర్మీ వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సరిహద్దుల నుంచి భారీగా ఆయుధాలను చైనా ఆర్మీ అందిస్తోంది. తాజాగా కొంతమంది చైనా ఆర్మీ కి చెందిన అధికారులు భారీగా పాకిస్తాన్ ఆర్మీకి ఆయుధాలను అందించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా అత్యాధునిక ఆయుధాలను పాకిస్తాన్ ఉగ్రవాదులకు అందించింది. అంతేకాకుండా అత్యాధునిక పరికరాలను కూడా అందించినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

వీటిలో ప్రధానంగా డ్రోన్లు ఉన్నాయని వాటి ద్వారా ఆయుధాలను సరఫరా చేయవచ్చని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనిపై భారత్ ఆర్మీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి సొరంగ మార్గాలను కాశ్మీర్లో కి తవ్వుతుంది. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక తాజా పరిణామాలతో భారత ఆర్మీ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతూ భద్రతను పటిష్టం చేశారు.