‘డ్రోన్లు మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్‌ను హేళన చేసిన ఇరాన్‌

-

ఇజ్రాయెల్ – ఇరాన్ల పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ వేడెక్కాయి. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడో అతి పెద్ద నగరమైన ఇస్ఫహాన్‌లో పేలుళ్లు సంభవించగా.. ఇది ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడేనంటూ అమెరికా చెప్పింది. టెల్‌ అవీవ్‌, టెహ్రాన్‌ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. అయితే తాజా పరిణామాలపై ఇరాన్‌ విదేశాంగ మంత్రి హొస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌ స్పందించారు.

దాడులకు ఉపయోగించినవి డ్రోన్లలా లేవని.. తమకు ఆటబొమ్మల్లాంటివంటూ ఇజ్రాయెల్‌పై హొస్సేన్‌ అమీర్‌ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇదే సమయంలో అవసరమైతే తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. అమెరికాలోని న్యూయార్క్‌ పర్యటనలో ఉన్న హొస్సేన్‌.. అగ్రరాజ్య భద్రతా మండలి సమావేశానికి హాజరైన సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడారు. శుక్రవారం జరిగింది దాడే కాదని అన్న ఆయన తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ ఎలాంటి సాహసం చేయలేదు కాబట్టి.. ఇప్పుడు తాము ప్రతిచర్యకు దిగట్లేదని చెప్పారు. కానీ ఒకవేళ ఆ దేశం తమకు నష్టం కలిగించేలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటే మాత్రం..ప్రతిస్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news