చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై దాడి ప్రారంభించిన ఇరాన్‌

-

అంతా అనుకున్నట్లే జరిగింది. చెప్పినట్లే ఇరాన్ ఇజ్రాయెల్పై యుద్ధం ప్రారంభించింది. శనివారం రోజున ఇరాన్ ఇజ్రాయెల్‌పై డజన్ల కొద్ది డ్రోన్‌లను ప్రయోగించింది. అవి లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని వెల్లడించింది.

ఇరాన్‌ నుంచి ఇరాక్‌ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌ వైపు డజన్ల కొద్ది డ్రోన్‌లు ఎగురుతున్నట్లు ఇరాన్‌ స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఆ క్షిపణులు, డ్రోన్లు ఇరాక్‌ గగనతలం మీద నుంచి ఇజ్రాయెల్‌వైపు దూసుకెళ్లగా.. వాటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక దళాలు మధ్యలోనే కూల్చివేసినట్లు సమాచారం. మరికొన్నింటిని సిరియా, జోర్డాన్‌ గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌ నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్‌ ఎయిరోస్పేస్‌పై విరుచుకుపడ్డ కొన్నిటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.

ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో ఐఆర్‌జీసీకి చెందిన పలువురు సీనియర్‌ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఇజ్రాయెలే కారణమని, ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దాడులు మొదలుపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news