ఈ నెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ

-

లోక్‌సభ ఎన్నికల వేళ నామినేషన్ల ఘట్టానికి అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియను అట్టహాసంగా నిర్వహించేలా ఆయా పార్టీలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ నెల 18న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆరోజే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయి 25వ తేదీ వరకు కొనసాగుతుంది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ, 25 వరకు గడువు ఉంటుంది. ఎక్కువమంది తొలి రోజుల్లోనే దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ సహా ఇతర మంత్రులు, కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు పాల్గొననున్నట్లు సమాచారం. ఇక బీజేపీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో కార్యక్రమాలలో ఆ పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి లేదా కేంద్రమంత్రి ఒకరు స్వయంగా పాల్గొనేలా కార్యక్రమం రూపొందించారు. 17 మంది లోక్‌సభ అభ్యర్థుల కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొంటారనే అంశం రెండు రోజుల్లో ఖరారవనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news