చాలా కాలం అజ్ఞాతం తర్వాత మే 1 న ప్రపంచానికి కనిపించారు ఉత్తరకొరియా నియంత కిమ్ జోన్ ఉన్! ఈయన ఆరోగ్యం ఏమీ బాగాలేదని, అందుకే అతి ముఖ్యమైన ఆయన తాతగారి కార్యక్రమానికి కూడా రాలేదని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ… కిమ్ కూడా బాహ్యప్రపంచానికి కనిపించలేదు. దీంతో కిమ్ చనిపోయాడని కొందరు, గుండే ఆపరేషన్ చేయించుకున్నాడని మరికొందరు, ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగాలేక బయటకు రాలేదని మరికొందరు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిమ్ ఉన్నపలంగా బయట కనిపించారు, అంతా షాక్ అయ్యారు… అయితే అది నిజమైన కిమ్ కాదంట!
ప్రపంచవ్యాప్తంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ మే 1న కిమ్ జోంగ్ ప్రజల మధ్యకు వచ్చాడు. రాజధాని ప్యాంగ్యాంగ్ కు సమీపంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాడు. దానికి సంబందించిన ఫొటోలు, వీడియోలను ఆ దేశ మీడియా మే2 న విడుదల చేసింది! దీంతో 20 రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్… పబ్లిక్‌లో ఒక్కసారిగా కనిపించే సరికి ఇప్పుడు ఈ విషయం కూడా దుమారంగా మారింది. మే 2న కనిపించింది కిమ్ ఏమాత్రం కాదని, నాడు కనిపించింది “నకిలి కిమ్” అని ఆన్ లైన్ వేదికగా ఆయన పాత ఫోటోలని కొత్త ఫోటోలతో పోలుస్తూ కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నారు నెటిజన్లు!
పాత కిమ్ కి కళ్లు కస్త తెరిచినట్లు ఉండేవని, ఆయన పై వరుసలో మద్య రెండు పళ్లు పొడవుగా ఉంటాయని… ఇలా రకరకాల గుర్తులు చెబుతున్నారు. వారి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కిమ్ పాతఫోటోలను, మొన్న 20 రోజుల గ్యాప్ తర్వాత వచ్చిన ఫోటోలను పక్కపక్కన పెట్టి తేడాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా గమనిస్తే… మే 2న ఉత్తరకొరియా పత్రికల్లో వచ్చిన ఫోటోల్లో కనిపించింది అసలు కిమ్ కాదనే విషయం అర్ధమయ్యేలా ఉందనే అభిప్రాయం మెజారిటీ ప్రజలు చెప్పడం గమనార్హం! దీనికీ కారణం లేకపోలేదు… ఎందుకంటే గతంలో ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలు హిట్లర్, సద్దామ్ హుస్సేన్ లాంటి వాళ్లు కూడా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు తమ బదులు తమ నకిలిని పంపించేవారు! ఇప్పుడు కిమ్ కూడా తన ఆరోగ్యం బాగుపడే వరకు ఇదే చెయ్యాలనుకుంటున్నారని కొందరు భావిస్తున్నారు.
మొన్న కనిపించింది ఒరిజినల్ కిమ్ కాదు… ఇదిగో ప్రూఫ్!
-