‘ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్)’కు చెందిన ‘నెట్జా యెహుదా’ బెటాలియన్‌పై ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాము వారించినా వెస్ట్ బ్యాంక్‌పై ఇజ్రాయెల్ దాడికి తెగబడిందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వెస్ట్ బ్యాంక్లోని పాలస్తినీయులపై మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు యాక్సియోస్ వార్తాసంస్థ ఓ కథనం ప్రచురించింది.
అమెరికా ఆంక్షల వార్తలపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ బైడెన్ సర్కార్పై గరమయ్యారు. ఉగ్రవాదులపై పోరాడుతున్న తరుణంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అమెరికాను కోరారు. ఇజ్రాయెల్ పౌరులపై చర్యలను తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. తమ సైనికులు ఉగ్రవాదులతో పోరాడుతున్నారని, ఈ తరుణంలో ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు. అలా చేసినట్లయితే అది అనైతికతం అన్న నెతన్యాహు దీన్ని అడ్డుకోవడానికి యత్నిస్తామని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
నెట్జా యెహుదా బెటాలియన్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. 2022 డిసెంబరులో వెస్ట్‌బ్యాంక్ నుంచి ఈ దళాన్ని ఇజ్రాయెల్ తరలించింది కానీ ప్రభుత్వం దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. నాటి నుంచి ఈ దళం ఇజ్రాయెల్ ఉత్తర భాగంలో పనిచేస్తున్నట్లు సమాచారం.