రాహుల్ గాంధీ చరిత్ర, రాజకీయం మీద బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు దేశ రాజకీయాలు రాహుల్ , మోదీ చుట్టే తిరుగుతున్నాయని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. కానీ రాహుల్, మోదీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. అద్వానీ రథయాత్ర ముందు దేశానికి మోదీ అంటే ఎవరో కూడా తెలియదన్న జగ్గారెడ్డి .. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా మోదీ గెలిచిన తర్వాత అద్వానీ ఆయణ్ను సీల్డ్ కవర్లో సీఎంగా ప్రకటించారని తెలిపారు. మోదీ సీల్డ్ కవర్ గుజరాత్ సీఎం అని చెప్పారు.
‘బీజేపీ నేతలు మోదీ సీల్డ్ కవర్ సీఎం కాదని చెప్పగలరా? రాహుల్ గాంధీ అనేక రాష్ట్రాల సీఎంలను సీల్డ్ కవర్ లో డిసైడ్ చేశారు. సీఎంలను డిసైడ్ చేసే రాహుల్కు.. సీల్డ్ కవర్ సీఎం మోదీకి చాలా తేడా ఉంది. మోదీ ప్రధాని కాకముందు ఏ పోరాటం చేశారో బీజేపీ నేతలు చెప్పాలి. అధికారంలో నుంచి వచ్చిన లీడర్ మోదీ. ప్రజల నుంచి వచ్చిన లీడర్ రాహుల్ గాంధీ.’ అని జగ్గారెడ్డి అన్నారు.