ఇరాన్ పై ప్రతిదాడి ఖాయం.. ఎలా చేయాలో మేం డిసైడ్ అవుతాం : నెతన్యాహు

-

ఇటీవల ఇజ్రాయెల్పై ఇరాన్ డ్రోన్లు, మిస్సైల్స్తో అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిని ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ సమర్థంగా తిప్పికొట్టింది. ఇరాన్ దాడికి తప్పనిసరిగా ప్రతిదాడి ఉంటుందని అప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. ఇక తాజాగా ఆయన దానిపై స్పందిస్తూ.. ఇరాన్‌పై ప్రతీకార దాడి ఎప్పుడు, ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఈ విషయంలో మిత్ర దేశాల సూచనలను తాము పట్టించుకోమని తెగేసి చెప్పారు. కేబినెట్‌ సహచరులతో బుధవారం రోజున సమావేశమైన నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టెల్‌ అవీవ్‌ పర్యటనలో ఉన్న బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ బుధవారం రోజున బెంజమిన్‌ నెతన్యాహును కలిశారు. ఈ సందర్భంగా దాడి విషయాన్ని కామెరూన్‌కు నెతన్యాహు చెప్పగా..ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా, బలంగా స్పందించాలని నెతన్యాహుకు చెప్పినట్లు తెలిపారు.

మరోవైపు తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్‌ను ఇరాన్‌ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్‌ మిగలదని వార్నింగ్ ఇచ్చారు. వార్షిక సైనిక పరేడ్‌లో ఇబ్రహీం రైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news