టైమ్స్ మోస్ట్‌ ఇన్‌ఫ్లూయెన్షియల్‌ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్‌

-

ప్రముఖ టైమ్‌ మేగజీన్‌ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, నటుడు, డైరెక్టర్‌ దేవ్‌ పటేల్‌ చోటు సంపాదించారు. అమెరికా ఇంధన శాఖ రుణ కార్యక్రమాల కార్యాలయ డైరెక్టర్‌ జిగర్‌ షా, యేల్‌ విశ్వవిద్యాలయంలో ఖగోళ, భౌతికశాస్త్రాల ప్రొఫెసర్‌ ప్రియంవదా నటరాజన్‌, భారత సంతతికి చెందిన రెస్టారెంటు యజమాని అస్మా ఖాన్‌, రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీ సతీమణి యులియా కూడా ఈ జాబితాలో ఉన్నారు.

అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్‌ యెలెన్‌ అజయ్‌బంగా ప్రొఫైల్‌ రాస్తూ.. ఓ కీలక సంస్థను పరివర్తనం చెందించే అత్యంత ముఖ్యమైన పనిని చేపట్టేందుకు నైపుణ్యం, ఉత్సుకత ఉన్న నాయకుడిని గుర్తించడం సులభమేమీ కాదని కానీ, గత జూన్‌లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అయిన తర్వాత అజయ్‌బంగా ఆ పనిని చేసి చూపించారని కొనియాడారు. సత్య నాదెళ్లను ప్రస్తావిస్తూ.. ఆయన మన భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తీవ్ర ప్రభావం చూపుతున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news