రూ.20 లక్షలు పెట్టి.. తోడేలులా మారిపోయిన జపాన్ వాసి

-

జీవితంలో ఒక్కొక్కరు ఒక్కో కల కంటుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. ఈ మధ్య లక్షలు ఖర్చు చేసి మరీ జంతువులుగా మారిపోవడం సాధారణమైపోయింది. గతంలో జపాన్ కు చెందిన ఓ వ్యక్తి లక్షలు ఖర్చు చేసి మరీ శునకంలా మారిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడే అదే దేశానికి చెందిన మరో వ్యక్తి రూ.20 లక్షలు ఖర్చు చేసి మరీ.. తోడేలులా మారిపోయాడు

జపాన్‌కు చెందిన ఓటోరు ఉయెదాది రూ.20 లక్షలు ఖర్చు చేసి మరీ.. చిన్నప్పటినుంచి నుంచి ఉన్న తన కోరికను తీర్చుకుని సంబురపడిపోతున్నాడు. ఓ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ‘తోడేలు దుస్తులు’ ధరించి  మురిసిపోతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. సినిమాలు, చలనచిత్ర రంగానికి కాస్ట్యూమ్స్‌ రూపొందించే ‘జెప్పెట్‌’ అనే సంస్థ ఈ తోడేలు దుస్తులను తయారు చేసింది. నలుగురు సిబ్బంది ఏడు వారాల పాటు కష్టపడి దీన్ని కుట్టినట్లు చెప్పింది.  ఇంట్లో వీలుచిక్కినప్పుడల్లా తోడేలులా మారిపోయి.. హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, బాధలన్నీ మరచిపోతున్నట్లు టోరు చెబుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news