పుష్ప 2 లో తమిళ్ హీరో సూర్య ?

-

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా చిత్రం పుష్ప.. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై భారీ విజయాన్ని అందించడమే కాకుండా నార్త్ ఇండియాలో ఎటువంటి అంచనాలు లేకుండా వంద కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు సృష్టించింది.

దీంతో ఒక్కసారిగా నార్త్ ఇండియన్స్ కూడా బన్నీకి అభిమానులు అయిపోయారు. ఇక ఆయన తదుపరి సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే పుష్ప సీక్వెల్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బన్నీ. అయితే ఈ సినిమా నుంచి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప రెండవ భాగంలో తమిళ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. పుష్ప సినిమాలో ఓ గెస్ట్ రోల్ ఉందట ఇందులో సూర్యను సంప్రదించిందట చిత్ర బృందం. దీనికి హీరో సూర్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఏ మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news