భారత్‌లో జీ20 శిఖరాగ్ర సదస్సు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ డుమ్మా..?

-

భారత్​లో జరగనున్న G-20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ డుమ్మా కొట్టనున్నట్లు తెలుస్తోంది. జిన్​పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్ లీ కియాంగ్ రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి.

సెప్టెంబర్ 9-10 తేదీల్లో దిల్లీలో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. భారత్‌, చైనా మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడానికి అవకాశం ఉండొచ్చని అంతా భావించారు. కానీ ఇప్పుడు జిన్​పింగ్​ హాజరుకారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఈ సదస్సుకు హాజరుకావడం లేదన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news