ట్రంప్ నాటకాలు ఆడితే మేము అలాగే సమాధానం చెప్తాం…!

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న చర్యలపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎన్నికల ఫలితాలు తనకు వ్యతిరేకంగా రావడంతో ట్రంప్ కాస్త వ్యూహం మార్చి కుట్ర జరుగుతుంది అనే ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆయన విషయంలో జో బిడెన్ వర్గం సీరియస్ అయింది. డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్ వర్గం మాట్లాడుతూ…

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓట్ల లెక్కింపును ఆపడానికి కోర్టుకు వెళ్లాలని బెదిరించడంతో చట్టపరమైన చర్యలకు రెడీ గా ఉన్నామని పేర్కొన్నారు. కౌంటింగ్ ని ఆపడానికి… కోర్టుకు వెళ్లాలని అధ్యక్షుడు బెదిరింపులకు పాల్పడితే, ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవటానికి మా వద్ద చట్టపరమైన బృందాలు సిద్ధంగా ఉన్నాయి అని అని బిడెన్ ప్రచార నిర్వాహకుడు జెన్ ఓ మాల్లీ డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ గేమ్స్ ఆడవద్దు అని ఆయన సూచించారు.