ఇటీవల అమెరికా వెళ్లిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి నుంచి దుబాయ్ వెళ్లారు. ఇక దుబాయ్ పర్యటనలో కేటీఆర్.. తెలంగాణకు అరబ్ పెట్టుబడులను తీసుకువస్తున్నారు. తొలిరోజే రూ.1,040 కోట్ల పెట్టుబడులు రావడం విశేషం. యూఏఈ దిగ్గజ సంస్థ నాఫ్కో తెలంగాణలో 700 కోట్లు పెట్టుబడిగా పెట్టేందుకు ఆసక్తి కనబర్చింది. మరోవైపు రాష్ట్రంలో రూ.215 కోట్ల పెట్టుబడితో తమ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ప్రముఖ పోర్టు ఆపరేటర్ ‘డీపీ వరల్డ్’ తెలిపింది.
మరోవైపు తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు లులూ గ్రూప్ ఛైర్మన్ యూసుఫ్ అలీ ప్రకటించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతోపాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో తమ సంస్థ కొనసాగిస్తున్న కార్యకలాపాలను మంత్రికి యూసుఫ్‌అలీ వివరించారు. తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రకటించిన మలబార్ గ్రూప్… ఇతర రంగాల్లోనూ తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. తాజాగా రూ.125 కోట్లతో ఫర్నిచర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో మరో రూ.125 కోట్లతో ఫర్నిచర్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. దీని వల్ల 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది.