అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ దూకుడు.. పోల్ సర్వేలో వెనకబడ్డ ట్రంప్

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఎప్పటికప్పుడు అమెరికాలోని పరిస్థితులను అంచనా వేస్తూ పలు సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. దీనిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. మొన్నటిదాక మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వైపు వీచిన గెలుపు గాలి.. ఇప్పుడు ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ వైపునకు వీస్తోంది. తాజాగా ప్రఖ్యాత సీబీఎస్‌ న్యూస్‌/యూగవ్‌ సంస్థ విడుదల చేసిన పోల్‌ సర్వేలో కమలా హారిస్‌ దూసుకెళ్లారు. డొనాల్డ్ ట్రంప్‌ కంటే ఆమె ముందజంలో ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉండనున్నట్లు తెలిపింది.

నవంబర్‌ 5న ఎన్నికలు జరగనుండగా ఇరువురు అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓవైపు హత్యాయత్నం అంశం ట్రంప్‌నకు కలిసి వస్తుందని అంతా భావిస్తుండగా.. మరోసారి బైడెన్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు విజయావకాశాలు మెరుగయ్యాయిని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కమలకు భారీ మొత్తంలో విరాళాలు రాడవం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఇక త్వరలోనే కమల తన రన్నింగ్‌ మేట్‌ను ప్రకటించనున్నట్లుగా సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news