Pakistan: కరాచీలో బాంబ్ బ్లాస్ట్.

-

వరసగా ఉగ్రదాడులతో పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. పాక్ వాణిజ్య రాజధాని కరాచీలో సోమవారం సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ సంభవించింది. కరాచీలోని ఖరదర్ ప్రాంతంలోని బాంబే బజార్ ఈ పేలుడు జరిగింది. కరాచీలో రద్దీగా ఉండే బాంబే బజార్ ప్రాంతంలో పేలుడు జరగడంతో చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక మహిళ చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. మరో 10 మంది దాాకా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇదిలా ఉంటే ఇటీవల పాకిస్తాన్ లో బాంబు దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా సింధ్ ప్రావిన్స్ లో బలూచ్ రెబల్స్ దాడులు పెరిగాయి. బెలూచిస్తాన్ లో సైన్యంపై, చైనా ప్రాజెక్ట్ లపై బెలూచ్ రెబల్స్ విరుచుకుపడుతున్నారు. తాజాగా ఈ పేలుడుకు ముందు మే 12 సద్దర్ ప్రాంతంలో బాంబు పేలుడుతో ఒకరు మరణించారు. మొన్న ఉత్తర వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో కూడా బాంబు దాడులు జరిగాయి. ఎప్రిల్ చివర్లో కరాచీ యూనివర్సిటీల వద్ద పేలుడు జరిగింది.  ఈ దాడిలో ముగ్గురు చైనా ఉపాధ్యాయులు మరణించారు.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news