నైజీరియాలో 200మంది స్టూడెంట్ల కిడ్నాప్‌.. ముష్క‌రుల దారుణం!

నైజీరియాలో దారుణాలు జ‌రుగుతున్నాయి. ఆ దేశంలో ముష్క‌రుల దాడులు అత్యంత కిరాత‌కంగా ఉంటున్నాయి. డ‌బ్బుల కోసం ఎంత‌టి దారుణాల‌కైనా తెగ‌బ‌డుతున్నాయి ముష్క‌ర గ్రూపులు. ఇప్ప‌టికే ఎంతోమంది చిన్నారుల‌ను పొట్ట‌న బెట్టుకున్న ఈ గ్రూపులు ఇప్పుడు మ‌రో పెద్ద దారుణానికి పాల్ప‌డ్డాయి. దీంతో దేశం ఒక్క‌సారిగా ఉలిక్క‌ప‌డింది.

నైజీరియాలోని ఒక స్కూళ్‌పై దాడి చేసిన ముష్క‌రులు.. అత్యంత కిరాత‌కంగా దాడి చేసి దాదాపు 200 మంది స్టూడెంట్ల‌ను కిడ్నాప్ చేశారు. కేంద్రరాష్ట్రమైన నైజర్‌లోని తెగినాలోని ఇస్లామిక్ స్కూల్‌పై ఒక్క‌సారిగా దాడి చేశాయి ముష్క‌ర గ్రూపులు.

ఈ దాడిలో దాదాపు 200మంది చిన్నారుల‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాయి ఈ దుర్మార్గ గ్రూపులు. అయితే ఆ ముష్క‌రులు తుపాకుల‌తో వచ్చి చిన్నారుల‌పై దాడి చేశారని, ఈ ప్ర‌మాద‌క‌ర దాడిలో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డ‌ట్టు అక్క‌డి సిబ్బంది చెప్పారు. ఇక కిడ్నాప్ అయిన పిల్ల‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.