BREAKING : కిమ్ జాంగ్ మృతి.. గుట్టు విప్పిన జర్నలిస్ట్..!

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ కు సంబంధించిన వార్తలు కొన్ని అంతర్జాతీయ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని, అందువల్లే కీలక బాధ్యతలు సోదరి కిమ్ యోంగ్ ఉన్​ కు కట్టబెట్టరాని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్-డే- జంగ్‌కు రాజకీయ వ్యవహారాల సలహాదారుడిగా పనిచేసిన చాంగ్ సాంగ్ మిన్ స్పందించారు. ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ కోమాలో ఉన్నట్లు మాత్రమే తను భావిస్తున్నాని ప్రాణాలతో అయితే ఉన్నారని చాంగ్ సాంగ్ మిన్ ది కొరియా హెరాల్డ్ అనే పత్రికతో చెప్పారు.

kims

అయితే పూర్తిస్థాయిలో అధికారాలు భర్తీ చేయడం జరగలేదని ప్రస్తుతం కిమ్ కోమాలో ఉన్నందున ఆ లోటును భర్తీ చేసేందుకు తాత్కాలికంగా మాత్రమే ఆయన సోదరి కిమ్ యో జాంగ్ తెరపైకి వచ్చారని చాంగ్ సాంగ్ మిన్ చెప్పారు. అయితే తాజాగా.. ఉత్తరకొరియా దేశవ్యాప్తంగా పర్యటించిన రాయ్ కాలీ అనే జర్నలిస్ట్ మాత్రం కిమ్ జాంగ్ ఉన్‌ ప్రాణాలతో లేరని చెప్తున్నారు. ఈ సందర్భగా కిమ్ తండ్రి.. కిమ్ జోంగ్-ఇల్ మరణించిన సమయాన్ని కూడా రాయ్ కాలీ గుర్తు చేశారు. కిమ్ జోంగ్-ఇల్ మరణించిన కొన్ని నెలల తర్వాత అయన చనిపోయినట్లు ఉత్తరకొరియా అధికారికంగా ప్రకటన చేసిందని అయన అన్నారు. ఇప్పుడు కూడా కిమ్ జోంగ్-ఉన్ సోదరి దేశం బాధ్యతలు స్వీకరించినప్పుడు అయన చనిపోయారన్న విషయం స్పష్టమవుతుందని రాయ్ కాలీ అన్నారు.

కాగా, గతంలో కూడా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇలాంటి పుకార్లు ఎన్నో వ‌చ్చాయి. కొంతమంది కిమ్ చనిపోయారని అంటే.. మరికొందరు అతడి ఆరోగ్యం క్షీణించిందని.. ఇంకొందరు ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందని అన్నారు.ఆ తరువాత అతడు బయటకు వచ్చి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగిపోయింది. మరి ఈసారి వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news