మోటా సృష్టి కర్త మార్క్ జుకన్ బర్గ్ దంపతులు మరో సారి తమ దాతృత్వం చాటుకున్నారు. ప్రపంచ వ్యాప్తం గా వివిధ వ్యాధులకు సంబంధించి మెరుగైన పరిశోధన ల కోసం మార్క్ జుకన్ బర్గ్, అతని భార్య ప్రిసిల్లా ఛాన్ భారీ గా సాయం చేశారు. తమ స్వచ్ఛం సంస్థ అయిన ఛాన్ జుకర్ బర్గ్ ఇనిషియేటివ్ (సీజెడ్ఐ) ద్వారా తక్షణ సాయం గా రూ. 25 వేల కోట్లు దానం చేశారు.
అంతే కాకుండా రానున్న కాలంలో దీని కోసం రెండున్నర లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ లో కృత్రిమ మేథ మీద పరిశోధనలు చేస్తున్నారని.. వారికి రూ. 3,770 కోట్లు అందజేస్తామని తెలిపారు. అలాగే మరో పది హేనేళ్ల పాటు ఈ సంస్థకు నింధులు అందజేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని అధికారికం గా సీజెడ్ఐ ప్రతినిధి జెఫ్ మెక్ గ్రెగర్ తెలిపారు. అలాగే ఆ సంస్థ కు మార్క్ జుకర్ బర్గ్ తల్లి అయిన కరేన్ కెంప్నెర్ జుకర్ బర్గ్ పేరు పెట్టామని ఆయన తెలిపారు.