నేపాల్ భూకంపం.. 128కి చేరిన మృతుల సంఖ్య

-

నేపాల్​లో భూకంపం పెను విషాదం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత నేపాల్ వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 128కి చేరింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల మధ్యే సహాయ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

నేపాల్​ ముఖ్యంగా జాజర్‌కోట్, రుకుమ్ జిల్లాలో భూకంప ప్రభావం తీవ్రంగా ఉందని.. ఈ రెండు జిల్లాల్లోనే 128 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిని ప్రధాన మంత్రి పుష్పకమల్ దహల్ పరిశీలించారు. భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విపత్తు సంభవించడం చాలా విచారకరమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నేపాల్​లోని భూకంప తీవ్రతకు భారత్​లోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​లోని వివిధ ప్రాంతాల్లో భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news