Hardik Pandya : టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బంగ్లా మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ నుంచి దూరం అయ్యారని సమాచారం అందుతోంది. బంగ్లా మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ నుంచి దూరం కానున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘పాండ్యా బెంగళూరులోని NCAకి వెళ్తారు. వైద్య బృందం అతని చీలమండ స్కాన్ రిపోర్టు అంచనా వేస్తుంది.
ఇంజక్షన్ తోనే పాండ్యా కోలుకుంటారు. అయితే.. హార్దిక్ పాండ్యా కోలుకోవడం ఇప్పుడే కోలుకోవడం చాలా కష్టమని వైద్యులు చెప్పారట. దీంతో.. హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ నుంచి దూరం అయ్యారని సమాచారం అందుతోంది. ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణాను టీంలోకి తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.