అమెరికా, సౌత్ కొరియాలను నాశనం చేస్తాం.. కిమ్ వార్నింగ్

-

అమెరికా, దక్షిణ కొరియా దేశాలకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశాలు తమను కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి వెనకాడమని హెచ్చరించారు. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని తన సైన్యానికి కిమ్ పిలుపునిచ్చారు. ఇక నుంచి దక్షిణ కొరియాతో ఎటువంటి సయోధ్య, పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని, విలీనం ప్రసక్తే లేదని కిమ్ తెగేసి చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రుదేశాల మధ్య మాదిరిగా మారాయని వెల్లడించిన విషయాన్ని ఆ దేశ జాతీయ మీడియా వెల్లడించింది.

ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును కాచుకొని ఉండాలని సైన్యానికి కిమ్ సూచించినట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. 2024లో అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కిమ్‌ భావిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కిమ్ నిన్న మిలటరీ కమాండర్ల మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఒక వేళ వాషింగ్టన్‌, సియోల్‌ సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే తమ వద్ద ఉన్న అణ్వాయుధాలు కూడా వాడటానికి వెనుకాడబోమని కిమ్ అన్నట్లు సమాచారం. తమ దేశాన్ని ప్రధాన శత్రువుగా ప్రకటించి తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవకాశం కోసం చూస్తున్న ప్రజలతో ఎటువంటి సంబంధాలు కొనసాగించమని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news