నార్త్ కొరియాలో 2 ఏళ్ల చిన్నారికి జీవిత ఖైదు

-

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. సిల్లీ కారణాలతో.. చిన్నచిన్న నేరాలకే అక్కడ ప్రాణాలు తీసే శిక్షలు విధిస్తారనే విషయం తెలిసిందే. తాజాగా అక్కడ ఓ రెండేళ్ల చిన్నారికి జీవితఖైదు విధించినట్లు తెలుస్తోంది. క్రైస్తవులపై ఉత్తరకొరియా ప్రభుత్వ ఆగడాల గురించి తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. క్రైస్తవులు తమ పవిత్ర గ్రంథంతో కన్పిస్తే అక్కడ కఠిన శిక్షలు విధిస్తున్నారట. అలా ఓ రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించినట్లు ఆ నివేదిక వెల్లడించింది.

‘అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022’ పేరుతో అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి ప్రజలపై పాల్పడుతున్న దారుణాలను పేర్కొంది. ఇతర మతాల వారి పట్ల కిమ్‌ రాజ్యం అమానవీయంగా ప్రవర్తిస్తోందని తెలిపింది. ఇప్పటివరకు అక్కడ దాదాపు 70వేల మంది క్రైస్తవులను ఖైదు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇందులో ఓ రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news