ఒమన్‌ ప్రభుత్వం వారికి క్షమాభిక్షకు మరోసారి గడువిచ్చింది..

ఒమన్‌ దేశంలో ఉంటు గడువు ముగిసినా, చట్ట విరుద్ధంగా అక్కడే ఉంటున్న విదేశీయులు వారి వారి దేశాలకు వెళ్లేందుకు ఆ దేశం ప్రకటించిన క్షమాభిక్ష గడువును ఈ ఏడాది డిసెంబర్‌ 31 గడువు ఇచ్చింది. కరోనా వ్యాప్తితో అంతర్జాతీయ విమానాల రద్దుతో మొదటిసారి ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. అక్కడ క్షమాభిక్ష పొందేవారు అధికంగా ఉండటంతో మరోసారి మార్చి 31 వరకు పొడిగించినట్లు ఒమన్‌ దేశ కార్మిక సంక్షేమ డైరెక్టర్‌ జనరల్‌ సేలం బిన్‌ సయీద్‌ అల్‌బాడి పేర్కొన్నారు. 2019 నవంబర్‌ 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన క్షమాభిక్షతో వివిధ కారణాలతో ఒమన్‌లో ఉంటున్న 12,378 మంది విదేశీయులు వారివారి దేశాలు, ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.

తెలుగు రాష్ట్రాల వారే అధికం..

అయితే.. అక్కడ ఉంటున్న దాదాపుగా 57,847 మంది తమ ప్రాంతాలకు వెళ్లేందుకు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల క్షమభిక్షకు గడవు పెంచడంతో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరింత పెరగవచ్చని సంబంధిత అ«ధికారి ఒకరు స్పష్టం చేశారు. ఒమన్‌ దేశంలో అమలవుతున్న క్షమాభిక్ష మూలంగా అన్ని ప్రాంతాల కన్నా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలిసింది. క్షమాభిక్ష పొందిన వారికి తమ వంతు సహమ సహకారాలు నిరంతరం అందిస్తాం.ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి ఉచితంగా విమాన టికెట్లను ఏర్పాటు చయనున్నట్లు ఒమన్‌ తెలంగాణ ఫ్రెండ్స్‌ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేంద్ర పన్నీరు హామీ ఇచ్చారు.