ఏడు దేశాల‌కు పాకిన‌ ఓమిక్రాన్ వేరియంట్

-

క‌రోనా వైర‌స్ త‌న మ్యూటెంట్ మార్చుకుని ఓమిక్రాన్ అనే వేరియంట్ తో వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఓమిక్రాన్ ఓరియంట్ ను మొద‌టి సారి ద‌క్షిణ ఆఫ్రీకా లో వెలుగు చూసింది. అయితే అతి త‌క్కువ రోజు ల్లో నే ఓమిక్రాన్ వేరియంట్ 7 దేశాలకు పాకింది. ఈ 7 దేశాల‌లో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. సౌతాఫ్రీకా తో పాటు బోట్స్ వానా, ఇజ్రాయెల్, ఇట‌లి, హాంగ్ కాంగ్, బెల్జియం, యునైటెడ్ కింగ్ డ‌మ్ దేశాల‌లో క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు ఎక్కువ గా వ‌స్తున్నాయి.

ఈ ఓమిక్రాన్ వేరియంట్ చాలా త‌క్కువ కాలంలో నే ఎక్కువ గా వ్యాప్తి చెందుతుంది. అలాగే ఈ ఓమిక్రాన్ వేరియంట్ చాలా ప్ర‌మాద‌కర‌మైన వేరియంట్ అని డ‌మ్యూ హెచ్ వో ప్ర‌తినిధులు కూడా హెచ్చ‌రిస్తున్నారు. కాగ ఈ ఓమిక్ర‌న్ వేరియంట్ తో అత్యంత జాగ్ర‌త్త గా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. కాగ మ‌న దేశం లో కూడా సౌత్ ఆఫ్రీకా నుంచి వ‌చ్చిన ఇద్ద‌రి లో ఓమిక్రాన్ వేరియంట్ ఉందా.. అని నిర్ధార‌ణ చేస్తున్నారు. నిన్న నే టెస్టు కోసం ముంబై కి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news