మరోసారి లాక్‌డౌన్ ఆలోచనలో ఆ దేశం.. ??

-

ప్రపంచంలో కరోనా సృష్టించిన కల్లోలాన్ని తలచుకుంటే రోమాలు నిక్కబొడుచుకోని వారుంటారా.. ఈ కరోనా వల్ల లోకం ఎన్నెన్నో హృదయవిదారక ఘటనలకు కేంద్ర బిందువుగా మారింది.. అంతే కాకుండా ప్రాణాంతక వైరస్‌ వల్ల ఎప్పుడు చనిపోతామో తెలియక రోగులు అల్లాడుతుంటే.. ఓ పక్క వారికి ధైర్యం చెబుతూ… మరోపక్క వారి కుటుంబ సభ్యులను సముదాయిస్తూ అనేక మంది వైద్య సిబ్బంది, తమ ఇంటికి కూడా పోకుండా ప్రజలకు తామున్నామనే భరోసా ఇవ్వడం నిజంగా గొప్పవిషయం.. ఇకపోతే కరోనా ధాటికి అతలాకుతలమైన దేశాల్లో ఇటలీ ఒకటి అన్న విషయం తెలిసిందే… దాదాపు 6 కోట్ల జనాభా ఉన్న ఈ యూరప్‌ దేశంలో 33 వేల మందికి పైగా కరోనా మహమ్మారికి బలైపోయారు.

అదీగాకుండా కరోనా వల్ల ఇక్కడ మరణించిన వారికి అంత్యక్రియలు సైతం నిర్వహించలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్దితి నుండి క్రమక్రమంగా కోలుకుంటున్న ఇటలీలో తాజాగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో అన్నీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. అయితే ఇంతవరకు కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోవడంతో ఈ రాక్షాసి మరోసారి విజృంభించే అవకాశం ఉందని మిలాన్‌లోని హుమానిటస్‌ పరిశోధనా ఆసుపత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగం అధిపతి మౌరిజియో చెకోని హెచ్చరించారు.

 

ఒకవేళ ఇదే గనుక జరిగి మళ్లీ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరిగినట్లయితే మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని ప్రభుత్వానికి సూచించారు.. నిజానికి ఇప్పటికే ఈ వైరస్ వల్ల కష్ట, నష్టాలు అనుభవించని వారు ఉండరు.. కానీ కరోనా అనేది ముమ్మాటికి మానవ తప్పిదమే.. ఆ తప్పులు తెలుసుకోకుండా, పరిస్దితులను గాడిలో పెట్టడానికి ప్రయత్నించకుండా కొన్ని దేశాలు కోతుల్లా ప్రవర్తిస్తున్నాయంటున్నారు కొందరు నెటిజన్స్..

Read more RELATED
Recommended to you

Latest news