బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన ఓపెన్ ఏఐ సీఈఓ ఆల్ట్ మన్

-

ఓపెన్‌ఏఐ కంపెనీ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆయన తన బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను పెళ్లాడారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసి పలువురు ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఆల్ట్‌మన్‌ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హవాయ్‌ నగరంలో సముద్రపు ఒడ్డున కొంతమంది సన్నిహితుల మధ్య ఈ జంట వివాహం జరిగింది.

ఆస్ట్రేలియాకు చెందిన మల్హెరిన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆల్ట్‌మన్‌, మల్హెరిన్‌ .. తమ బంధం గురించి ఎప్పుడూ బటయ మాట్లాడిన సందర్భాలు లేవు. 2023 సెప్టెంబర్‌లో న్యూయార్క్‌ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ ఇద్దరమూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒకే ఇంట్లో ఉంటున్నామని ఆల్ట్‌మన్‌ తొలిసారిగా తన రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయ్యారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందుకు ఆల్ట్‌మన్‌ మొదటిసారి మల్హెరిన్‌తో కలిసి రావడంతో ఈ జంట రిలేషన్షిప్ కన్ఫామ్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news