వ్యాపారాలను కూడా తన గ్రిప్ లో పెట్టుకున్న ఆర్మీ…!

ప్రపంచంలో అత్యంత బలమైన సైన్యాలలో ఒకటిగా చెప్పే పాకిస్తాన్ ఆర్మీపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అక్కడ ఉన్న అన్ని వ్యాపారాలను కూడా సైన్యంలో ఉన్న కీలక అధికారులు తమ గ్రిప్ లో ఉంచుకున్నారు. దేశంలో కర్మాగారాలు మరియు బేకరీల నుండి వ్యవసాయ భూములు మరియు గోల్ఫ్ కోర్సులు వరకు అన్నింటినీ సైన్యమే నియంత్రిస్తుంది.

6,20,000 మంది సైనికులతో, పాకిస్తాన్ ప్రపంచంలో ఏడవ అతిపెద్ద స్టాండింగ్ సైన్యం అని గొప్పగా చెప్పుకుంటుంది. కాని దాని సీనియర్ అధికారులు మాత్రం వ్యాపారాల్లో ఆరితేరిపోయారు. 1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, సైన్యం పాకిస్తాన్ యొక్క ఆర్ధికవ్యవస్థలో స్థిరంగా తన బలాన్ని కొనసాగిస్తూనే ఉంది. దేశంలో రొట్టెలను సైనిక యాజమాన్యంలోని బేకరీలు సరఫరా చేస్తాయి. ఆర్మీ నియంత్రణలో ఉన్న బ్యాంకులు డిపాజిట్లు తీసుకొని రుణాలు పంపిణీ చేస్తాయి.