పాకిస్తాన్‌లో కలవాలా? వద్దా కశ్మీరీలే నిర్ణయిస్తారు: ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ అంశంలో తమ విధానాన్ని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్‌లో విలీనం కావాలా? లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలా అనే విషయం కశ్మీరీల ప్రజలు నిర్ణయించుకుంటారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ | imran khan
imran khan | ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని తరార్ ఖల్ ఎన్నికల సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. ఇక్కడ ఈ నెల 25న ఎన్నికలు జరగనున్నాయి. పీఓకే పాకిస్తాన్‌లో విలీనం చేసి, రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం చూస్తున్నదన్న ప్రతిపక్షాల వాదనను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. ఈ చర్చ ఎక్కడ ప్రారంభమైందన్ని విషయం తనకైతే తెలియదు అని పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాల ప్రకారం తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకొనే రోజు కశ్మీరీల కోసం తప్పక వస్తుందన్నారు.

అలాంటి రోజున కశ్మీరీల పాకిస్తాన్‌లో విలీనం కావాలని నిర్ణయించకుంటారని ఇమ్రాన్ ఖాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కశ్మీరీల కోసం తమ ప్రభుత్వం మరో ప్రజాభిప్రాయ సేకరణ‌ను చేపడుతుందని, పాకిస్తానీలతో కలసి జీవించాలని అనుకుంటున్నారా లేదా స్వతంత్ర రాజ్యంలో బతకాలని అనుకుంటున్నారా అనే విషయం తెలుసుకుంటామన్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. భారతదేశంలో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ఉన్నది. ఎప్పటికీ ఉంటుంది కూడా అని స్పష్టం చేసింది.