రష్యా పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

-

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ, రేపు ఆయన రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. పలు అంశాలపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రష్యాతో పాటు ప్రధాని ఆస్ట్రియాకు వెళ్తారు. బయల్దేరడానికి ముందు మోదీ ఎక్స్‌(ట్విటర్) వేదికగా స్పందించారు.

‘‘రానున్న మూడు రోజులు రష్యా, ఆస్ట్రియాలో పర్యటిస్తాను. కాలం పెట్టిన పరీక్షలకు నిలిచిన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ సందర్శనలు ఉపయోగపడనున్నాయి. అలాగే అక్కడి ప్రవాస భారతీయులతో మాట్లాడేందుకు వేచి చూస్తున్నా’’ అని ప్రధాని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు.

మరోవైపు మోదీ పర్యటనపై రష్యాలో భారత రాయబారి వినయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. వార్షిక సదస్సులో భాగంగా ఈ పర్యటన జరుగుతోందని చెప్పారు. రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలకే ఈ భేటీలో ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు, శాస్త్ర, సాంకేతిక పరిశోధన వంటి రంగాలపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news