చైనాతో దోస్తీ వేళ.. మాల్దీవుల పార్లమెంట్ ఎన్నికల్లో మొయిజ్జు పార్టీ ఘన విజయం

-

చైనాతో దోస్తీ వేళ మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జుకు చెందిన పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (పీఎన్‌సీ) ‘భారీ మెజార్టీ’తో విజయం సాధించింది. మొత్తం 93 స్థానాలకు గాను సొంతంగా 68 సీట్లను కైవసం చేసుకోవడంతో ముయిజ్జు అనుసరిస్తున్న చైనా అనుకూల విధానానికి దేశంలో బలమైన మద్దతు లభించినట్లయింది. ఈ ఎన్నికలను అటు చైనా, ఇటు భారత్‌లు నిశితంగా పరిశీలించాయి.

మాల్దీవుల పార్లమెంటు (పీపుల్స్‌ మజ్లీస్‌)లోని 93 నియోజకవర్గాలకు ఆదివారం నిర్వహించిన పోలింగ్‌ లో 75 శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఫలితాల్లో ముయిజ్జుకు చెందిన పీఎన్‌సీ 68 స్థానాలు గెల్చుకోగా.. మిత్రపక్షాలు మాల్దీవ్స్‌ నేషనల్‌ పార్టీ (ఎంఎన్‌పీ) ఒకటి, మాల్దీవ్స్‌ డెవలప్‌మెంట్‌ అలయెన్స్‌ (ఎండీఏ) రెండు సీట్లను గెల్చుకుంది. 71 స్థానాలతో కూటమి ‘భారీ మెజార్టీ’ సాధించింది. భారత్‌కు అనుకూలంగా ఉండే మాల్దీవియన్‌ డెమొక్రటిక్‌ పార్టీ (ఎండీపీ) 15 సీట్లకే పరిమితమైంది. అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ పార్లమెంటులో పార్టీ బలం తక్కువగా ఉండటంతో ముయిజ్జు సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయారు. తాజా విజయంతో.. తనకు నచ్చిన విధానాలను రూపొందించుకునేందుకు ఆయనకు మార్గం సుగమమైనట్లు విశ్లేషకుల అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news