లోక్ సభ పోరులో బీజేపీ బోణీ.. సూరత్ సీట్ ఏకగ్రీవం

-

దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. అధికార బీజేపీ కేంద్రంలో మరోసారి విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇండియా కూటమి మోదీని ఎలాగైనా గద్దె దించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ పోరులో బీజేపీ బోణీ కొట్టింది. గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రపోజర్లుగా సంతకాలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఆదివారం (ఏప్రిల్ 21) జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆ వెంటనే సూరత్ స్థానం నుంచి నామినేషన్లు వేసిన మిగతా 8 మంది అభ్యర్థులంతా పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో ముకేశ్ దలాల్ సూరత్ నుంచి ఏకగ్రీవంగా లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. ముకేశ్ దలాల్‌ను అభినందిస్తూ గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ చేతికి మొదటి విజయ కమలాన్ని అందించినందుకు ఆయనను అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news