వాహనదారులకు అలర్ట్..ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ లోని గౌలిగూడ రామ్ మందిర్ నుంచి మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది హనుమాన్ శోభాయాత్ర. ఈ తరుణంలోనే 12 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాటు చేశారు. 13 కిలో మీటర్ల మేర హనుమాన్ శోభాయాత్ర సాగనుంది. అడుగడుగునా సీసీ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు.
ఈ శోభయాత్ర సాగే రూట్ మ్యాప్ లో 450 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. బంజారాహిల్స్ లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి శోభాయాత్ర పర్యవేక్షణ చేస్తున్నారు. వెహికిల్ మౌంటెడ్ జూమ్ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. షి టిమ్స్, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీం, సిటి టాస్క్ ఫోర్స్ , రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటి ఆర్మ్ రిజర్వ్ పోలీస్, తెలంగాణ పోలీస్ బెటాలియన్, క్రైమ్ & మఫ్టి టీం పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
ఇక హనుమాన్ శోభాయాత్ర..కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. గౌలిగూడ, ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోటి, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్ వెనుక, కవాయిగూడ, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాల పేట్ పిఎస్ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగున్నాయి.