ప్రధాని మోదీ రష్యా పర్యటన.. భారత్‌కు భారీ దౌత్య విజయం

-

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భారత్కు భారీ దౌత్య విజయం అందించారు. సోమవారం రోజున ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో విందులో పాల్గొన్న మోదీ.. రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అనూహ్య పరిస్థితుల్లో అక్కడి ఆర్మీ వద్ద చిక్కుకుపోయిన వారి ప్రస్తావన తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వారిని విడిచి పెట్టి స్వదేశానికి పంపాల్సిందిగా కోరారు. వారందరినీ వదిలిపెట్టేందుకు రష్యా తాజాగా అంగీకరించినట్లు సమాచారం. ఇరు దేశాధినేతలు మోదీ, పుతిన్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాలో చిక్కుకున్న భారతీయు మాస్కో సైన్యానికి సహాయకులుగా పని చేస్తున్నారు. పుతిన్తో ప్రైవేట్‌ డిన్నర్‌లో యుద్ధంలో పనిచేస్తున్న భారతీయుల అంశాన్ని మన ప్రధాని .. ఆయన వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇందుకు అంగీకరించిన రష్యా అధినేత వారిని విధుల నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగాస్వదేశానికి పంపిస్తామని హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల ఆశ చూపి భారత్‌ నుంచి కొంతమంది యువకులను మోసపూరితంగా రష్యాకు తరలించి ఉక్రెయిన్‌తో యుద్ధంలోకి దింపారని గతంలో కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో కేంద్ర విదేశాంగ శాఖ స్పందించి మాస్కో అధికారులతో సంప్రదింపులు జరిపి కొంతమంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చింది. ఇంకా 30-40 మంది భారత యువకులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news