‘ఉక్రెయిన్‌ యుద్ధం కొన్ని నెలల క్రితమే ఆగిపోయేది..’: పుతిన్‌ కీలక వ్యాఖ్యలు..

-

ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా జోక్యం చేసుకోకపోతే ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి ఎప్పుడో శాంతియుత పరిష్కారం లభించేదని అన్నారు. తమ దేశం నాటోలో చేరదామని అనుకొన్నా అది సాధ్యం కాలేదని తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలయ్యాక ఆయన తొలిసారి అమెరికాకు చెందిన ఫాక్స్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ టకర్‌ కార్ల్‌సన్‌కు సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో పలు అంశాలపై స్పష్టంగా స్పందించారు.

2008లో నాటో కూటమి ఉక్రెయిన్‌కు ద్వారాలు తెరిచిందని, 2014లో ఆ దేశంలో తిరుగుబాటు జరిగిందని పుతిన్ తెలిపారు. దానిని అంగీకరించని వారిపై కేసులు పెట్టారని, అక్కడి ప్రభుత్వం క్రిమియాకు ముప్పుగా మారిందని చెప్పారు. డాన్‌బాస్‌లో ఉక్రెయిన్‌ పాలకులు యుద్ధం మొదలుపెట్టి ప్రజలపై శతఘ్ని గుండ్లు ప్రయోగించడంతోనే సైనిక చర్య మొదలైందని వివరించారు.

‘‘ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించడానికి అవసరమైన సంధి పత్రాన్ని ఇస్తాంబుల్‌లో సిద్ధం చేశాం. దీనిలో పలు అంశాలపై కీవ్‌ ప్రతినిధి బృందం నాయకుడు సంతకం కూడా చేశారు. తాము ఒప్పందానికి సిద్ధమని వెల్లడించారు. అది పూర్తయితే యుద్ధం ఎప్పుడో ముగిసేది. అదే సమయంలో అప్పటి బ్రిటన్‌  ప్రధాని జాన్సన్‌ వచ్చి మాతో మాట్లాడారు. ఆ సంధి ప్రతిపాదన ఆగిపోయింది’’ అని పుతిన్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news