రష్యా, చైనా స్నేహం ఏ దేశానికి వ్యతిరేకం కాదు.. జెన్ పింగ్, పుతిన్ ల ప్రకటన

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటిస్తున్నారు. రష్యాకు అయిదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం తొలి విదేశీ పర్యటనకు ఆయన చైనాను ఎంచుకున్నారు. రెండు రోజుల పర్యటనకు ఇక్కడకు చేరుకున్న పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. రష్యా-చైనాల మధ్య వ్యూహపరమైన బంధానికి అడ్డంకులు సృష్టించాలని అమెరికా చేసే ప్రయత్నాలను సాగనివ్వబోమని పుతిన్‌, జిన్‌పింగ్‌లు గురువారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పరోక్షంగా స్పష్టం చేశారు.

తమ మైత్రి ఏ ఇతర దేశానికీ వ్యతిరేకం కాదని, కాబట్టి దానికి విఘాతం కలిగించే ప్రయత్నాలను వమ్ము చేస్తామని ఇరుదేశాధినేతలు తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (70) ఆకాంక్షించారు. సంప్రదింపుల ద్వారా యుద్ధం ముగిసేలా కృషిచేసేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధమేనని రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ (71) ప్రకటించారు.  బీజింగ్‌లో పుతిన్‌, జిన్‌పింగ్‌ల సమావేశం సందర్భంగా రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యూహపరమైన సహకార అభివృద్ధికి పలు ఒప్పందాలు కుదిరాయి.

Read more RELATED
Recommended to you

Latest news