నాడు కరోనా కాటు.. నేడు పక్షి కాటు…! బ్రెజిల్ అధ్యక్షుడి పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే అతను ఏ ఆసుపత్రి కి వెళ్ళకుండా తన ప్రెసిడెన్షియల్ ప్యాలస్ లోనే ఒంటరిగా ఉంటున్నారు. క్వారంటైన్ లో ఉంటున్న ఈ బ్రెజిల్ అధ్యక్షుడికి నాలుగు గోడల మధ్య చాలా రోజులపాటు ఉండటంతో బాగా చిరాకు పుట్టిందేమో పాపం. అందుకే సోమవారం అధ్యక్ష భవనం లో నివాసముంటున్న పక్షులకు ఆహారం అందించడానికి వెళ్ళాడట. అన్ని పక్షులకు తన చేతి నుండి ఆహారం అందిస్తున్న సమయంలో ఒక పక్షి అతని చేతిని గట్టిగా కరిచింది.

brezil president
brazil president

దీంతో ఒక్కసారిగా షాక్ కి గురైన బ్రెజిల్ అధ్యక్షుడు తన చేతిని వెనక్కి లాక్కున్నాడు. కానీ, అప్పటికే అతని చేతికి తీవ్ర గాయం అయ్యింది. అయితే జైర్ బోల్సోనారో ని పక్షి కరిచిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మూడు ఫోటోలో జైర్ బోల్సోనారో ని పక్షి కరవడం, అతడు అరవడం, ఆపై అక్కడి నుండి వెళ్ళి పోవడం కనిపించాయి. ఏది ఏమైనా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో టైం ఏమీ బాగోలేదని సానుభూతితో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.