బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా ప్రధాని పదవి, తండ్రిగా నిర్వర్తించాల్సిన బాధ్యల గురించి మాట్లాడారు. ఓ పక్క పలు సమస్యలు ఎదుర్కొంటున్న దేశానికి ప్రధానిగా వ్యవహరించడం.. మరోపక్క ఇద్దరు చిన్న పిల్లలకు మంచి తండ్రిగా ఉండటం.. ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం తనకు కష్టంగా ఉందని రిషి సునాక్ పేర్కొన్నారు. ‘ద టైమ్స్’ కోసం కన్జర్వేటివ్ పార్టీ మాజీ నేత విలియం హేగ్‌కు సునాక్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన సునాక్.. తాను ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడారు.
తన కుమార్తెలైన కృష్ణ (12), అనౌష్క (11)లను చూసుకోవడానికి తనకు తగినంత సమయం దొరకడం లేదంటూ ఆందోళనకు గురవుతున్నట్లు రిషి సునాక్ తెలిపారు. ప్రధానిగా విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇవ్వాలని, అది అత్యంత ముఖ్యమైనదని వ్యాఖ్యానించారు. యావత్తు దేశం తరఫున కర్తవ్య నిర్వహణ వల్ల తన కుమార్తెలతో ఓ తండ్రిగా గడపాల్సిన సమయాన్ని కేటాయించలేకపోతున్నానని, ఇది పెద్ద సవాలేనని అన్నారు. పనుల సర్దుబాటు కారణంగా కొన్ని బాంధవ్యాలను కోల్పోతున్నానని, ఇది చాలా కష్టమైనదేనని తెలిపారు.