నాటో దేశాలపై దాడులు చేయం.. కానీ ..?: పుతిన్‌

-

నాటో దేశాలపై కొంతకాలంగా గుర్రుగా ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే వార్తలను ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌ ఖండించారు. కానీ ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఎఫ్‌-16 యుద్ధ విమానాలను అందజేస్తే వాటిని మాత్రం తప్పకుండా కూల్చేస్తామని స్పష్టం చేశారు.

1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన తర్వాత అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమి రష్యా వైపుగా విస్తరించిందని, కానీ నాటో దేశాలపై దూకుడుగా వ్యవహరించాలనే ఆలోచన తమకు లేదని పుతిన్ అన్నారు. పోలండ్‌, చెక్‌ రిపబ్లిక్‌లపై రష్యా దాడి చేస్తుందని పశ్చిమ దేశాలు పిచ్చి వాదన చేస్తున్నాయని ఆ వాదనను కొట్టిపారేశారు. ఒకవేళ ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా సైన్యాన్ని పంపినా, ఎఫ్‌-16లను ఇచ్చినా వాటిని కూల్చి వేయడం ఖాయమని స్పష్టం చేశారు. పొరుగు దేశాల నుంచి రష్యాను లక్ష్యంగా చేసుకున్నా.. అమెరికా కోసం ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news